నీ కలల కలుగులో పడి
నడి రాత్రిని నమ్మకున్నాను...
నీ మాయల మోజులో పడి.
ఏమిటైనా... ఎందుకైనా...
నీ మాటల మౌనరాగం
నా మదిన చేసే అలజడి
నా మనసుని ముంచివేస్తోంది.
ప్రియతమా
ఎన్నాళ్ళు నాకీ ఎడబాటు... ?
నీ మౌనానికి తెర దించు...
నా ప్రేమకి స్వేచ్చని కలిగించు...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నా మది
నీ కమ్మని చూపుల కౌగిలికై
నీ చిరునవ్వుల సంకెలకై
సిరి మువ్వల సందదికై
ఆశగా వేచిచూస్తోంది... నిన్ను త్వరగా కదలమంటోంది.
నా ఈ మది చిన్ని కోరికను తీర్చటానికి
నీ మనసు పంచటానికి
నా మనసును మురిపించటానికి
త్వరగా వస్తావని ఆశిస్తున్నాను...
ఇట్లు
నీ ప్రేమకై
నీ చిన్నా

