Friday, 17 January 2014

నాకు వరం లానే అనిపిస్తోంది.


నాకు తెలుసు ఇది నీకు తెలుసని
' ఇది ' నా ప్రేమని


కాలం చాలా వేగంగా తిరిగిపోతోంది.
మెరుపులా నా జీవితం లోకి వచ్చావు.
నేను కోరుకోలేదు.
బహుశా ఆ దేవుడే పంపించాడేమో...

నీ రాక నా జీవితానికి ఒక వరమైంది.
శాపం కూడా అయిందేమో...
నాకు వరం లానే అనిపిస్తోంది.

నీకు సంబంధించినంత వరకు నేను కోరుకునేది
నీ పెదాల చిరునవ్వు,
                ఆనందంగా ఉండే నీ మనసు.

అందుకే...

విలువ కట్టలేని నా విలువైన జీవితాన్ని
నీ కోసమే భద్రపరుస్తున్నాను.

నా ప్రేమకు ఊపిరి నీ తోడు కాదు.
                         నీ సంతోషాల తోడు.
ఆ చిరునవ్వుకోసం, చిలిపి మనసు కోసం
జీవితాంతం నీ తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను.


-
నీ ప్రేమికుడు చిన్నా

ఇంకా ఎన్నాళ్ళురా నాతో ఉంటావ్ ??


మాటలు మూగబోతున్నాయి...
నీ గురుతులు నన్ను తాకుతుంటే...

ఆశలు ఆకాశాన్నంటుకుంటున్నాయి...
నీ ఊహలు నన్ను చేరుకుంటుంటే...

నా మనసు దోచుకున్న నీకు
దాని విలువ చెప్పాలని
ఆ వంకతో నీ మనసుని దోచుకోవాలని
ఆశగా ఎదురు చూస్తున్నా...

నన్ను త్వరగా చేరుకోవే ప్రియతమా...
ఈ ఒంటరితనం నాకు చుక్కలు చూపిస్తోంది...
" ఇంకా ఎన్నాళ్ళురా నాతో ఉంటావ్ ?? " అని
నిలదీస్తూ అవమానిస్తోంది...

నన్ను చేరే క్షణం
మన దూరం కరిగి
గాలికి సైతం ఊపిరాడక
మన మద్యనుండి వెళ్ళిపోవాలి...

ఆ క్షణం నన్ను చేరినప్పుడు...
నా ఈ జీవితాన్ని
నీ పాదాల చెంత పెడతాను...
నా తుది శ్వాస వరకు
నీ సంతోషం కోసమే జీవిస్తాను...

నా మాట తప్పనని
మాట ఇస్తున్నాను...

-
ఇట్లు నీ చిన్నా


నాకు ఇది నీకని పరిచయం చేస్తోంది...


ఓ ప్రియతమా...!!!

నీ కలల సంద్రం 
నా మనసుని ముంచివేస్తుంటే...
నా మది ప్రేమ అలలతో
ఒడ్డుకు చేరాలని తపన పడుతోంది...

ఈ చిన్ని మనసుకి ఎందుకో ఇంత ఆశ...
కనీసం నీ ప్రతి-మాటలైనా చాలని
ప్రతిక్షణం నీ నామ సంకీర్తనలలో తడిసిపోతోంది...

ఇన్నాళ్ళ ఈ ఎడబాటు
నా మనసుని మార్చివేస్తోంది...
నేను కోరుకోని మార్పుని
నాకు ఇది నీకని పరిచయం చేస్తోంది...

నాకు నీ ప్రపంచమే నచ్చింది...
ఈ జీవితాంతం దాని ఊహల అలజడిలో
నీ చిరునవ్వుల అల్లరి ఆటపట్టింపులలో
కదిలిపోవాలని, కరిగిపోవాలని
ఆశపడుతున్నాను...

నా ఈ చిన్ని చిన్ని ఆశలను
ప్రేమతో నిజం చేస్తావని 
నీకోసం ఎదురుచూస్తూ...

-
నీ చిన్నా