నాకు తెలుసు ఇది నీకు తెలుసని
' ఇది ' నా ప్రేమని
కాలం చాలా వేగంగా తిరిగిపోతోంది.
మెరుపులా నా జీవితం లోకి వచ్చావు.
నేను కోరుకోలేదు.
బహుశా ఆ దేవుడే పంపించాడేమో...
నీ రాక నా జీవితానికి ఒక వరమైంది.
శాపం కూడా అయిందేమో...
నాకు వరం లానే అనిపిస్తోంది.
నీకు సంబంధించినంత వరకు నేను కోరుకునేది
నీ పెదాల చిరునవ్వు,
ఆనందంగా ఉండే నీ మనసు.
అందుకే...
విలువ కట్టలేని నా విలువైన జీవితాన్ని
నీ కోసమే భద్రపరుస్తున్నాను.
నా ప్రేమకు ఊపిరి నీ తోడు కాదు.
నీ సంతోషాల తోడు.
ఆ చిరునవ్వుకోసం, చిలిపి మనసు కోసం
జీవితాంతం నీ తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను.
-
నీ ప్రేమికుడు చిన్నా


