నీ కలల సంద్రం
నా మనసుని ముంచివేస్తుంటే...
నా మది ప్రేమ అలలతో
ఒడ్డుకు చేరాలని తపన పడుతోంది...
ఈ చిన్ని మనసుకి ఎందుకో ఇంత ఆశ...
కనీసం నీ ప్రతి-మాటలైనా చాలని
ప్రతిక్షణం నీ నామ సంకీర్తనలలో తడిసిపోతోంది...
ఇన్నాళ్ళ ఈ ఎడబాటు
నా మనసుని మార్చివేస్తోంది...
నేను కోరుకోని మార్పుని
నాకు ఇది నీకని పరిచయం చేస్తోంది...
నాకు నీ ప్రపంచమే నచ్చింది...
ఈ జీవితాంతం దాని ఊహల అలజడిలో
నీ చిరునవ్వుల అల్లరి ఆటపట్టింపులలో
కదిలిపోవాలని, కరిగిపోవాలని
ఆశపడుతున్నాను...
నా ఈ చిన్ని చిన్ని ఆశలను
ప్రేమతో నిజం చేస్తావని
నీకోసం ఎదురుచూస్తూ...
-
నీ చిన్నా

No comments:
Post a Comment