Friday, 17 January 2014

ఇంకా ఎన్నాళ్ళురా నాతో ఉంటావ్ ??


మాటలు మూగబోతున్నాయి...
నీ గురుతులు నన్ను తాకుతుంటే...

ఆశలు ఆకాశాన్నంటుకుంటున్నాయి...
నీ ఊహలు నన్ను చేరుకుంటుంటే...

నా మనసు దోచుకున్న నీకు
దాని విలువ చెప్పాలని
ఆ వంకతో నీ మనసుని దోచుకోవాలని
ఆశగా ఎదురు చూస్తున్నా...

నన్ను త్వరగా చేరుకోవే ప్రియతమా...
ఈ ఒంటరితనం నాకు చుక్కలు చూపిస్తోంది...
" ఇంకా ఎన్నాళ్ళురా నాతో ఉంటావ్ ?? " అని
నిలదీస్తూ అవమానిస్తోంది...

నన్ను చేరే క్షణం
మన దూరం కరిగి
గాలికి సైతం ఊపిరాడక
మన మద్యనుండి వెళ్ళిపోవాలి...

ఆ క్షణం నన్ను చేరినప్పుడు...
నా ఈ జీవితాన్ని
నీ పాదాల చెంత పెడతాను...
నా తుది శ్వాస వరకు
నీ సంతోషం కోసమే జీవిస్తాను...

నా మాట తప్పనని
మాట ఇస్తున్నాను...

-
ఇట్లు నీ చిన్నా


1 comment: