నా ఈ తొలి ఉదయాన
నీ కమ్మని మాటల సందడి
మనసుని చేరాలనే తపన
నీ హృదయ కమలాన్ని
నా వశం చేసుకోవాలనే ఆవేదన
ఈ శీతల కాలపు చిరు గాలులు
నీ దరికి చేరమని హెచ్చరిస్తున్నాయి...
నీ చిరు కౌగిలి సంకెలలో చేరి
విముక్తి కలిగించమని వేడుకుంటున్నాయి...
ఎందుకే ప్రియతమా...
దూరంగా ఉండి కవ్విస్తావు...
దరి చేరేలోపే మరిపిస్తావు...
ముసి ముసి నవ్వులతో మురిపిస్తావు...
కనుసైగల మంటలతో కాల్చేస్తావు...
నా ప్రశ్నల సమాధానం కోసం,
నీవు నన్ను చేరే మధుర తరుణం కోసం
ఎదురు చూస్తూ నీకోసం వేచి ఉంటాను...
ఇట్లు
నీ చిన్నా ( జి.సి.యస్ )

No comments:
Post a Comment